Featured

Shekhar Master : రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్… దయచేసి ఆలా రాయొద్దంటూ…!

Shekhar Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఇక ఆయన పెద్ద కర్మ కార్యక్రమాన్ని ఆయన శిష్యులు చేసారు. ఇక ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

మాస్టర్ కి పెళ్లి చేసింది మేమే…

రాకేష్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమంను శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ తమ భుజాల మీద వేసుకుని ఘనంగా చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఆ కార్యక్రమంలో మాట్లాడిన శేఖర్ మాస్టర్ తన గురువుని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. తాను డాన్స్ చేయడానికి ప్రభుదేవా మాస్టర్ స్ఫూర్తిని ఇస్తే ఆ తరువాత స్ఫూర్తిని ఇచ్చింది, స్టైల్ గా ఎలా డాన్స్ చేయాలో నేర్పింది మాత్రం రాకేష్ మాస్టర్ అంటూ చెప్పారు. ఆయన మాకు ఎంతో క్రమశిక్షణ నేర్పారని డాన్స్ నేర్చుకునేటప్పుడు ఆయన ఎలా చెప్పాడో ఆలా రాకపోతే పది సార్లైనా నేర్చుకోవల్సిందే కానీ కంప్రమైస్ అయ్యేవారు కాదని చెప్పారు.

ఇక ఆయన పెళ్లి తన చేతుల మీద జరిగిందని చెప్పారు. మాస్టర్ ఎక్కడున్నా ఏం చేస్తున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. ఇలా ఇంత త్వరగా మమ్మల్ని వదిలి పోతారని అనుకోలేదని శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఇక మాస్టర్ గురించి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల గురించి మాట్లాడుతూ అవాస్తవాలను దయచేసి రాయకండి, ఎవరి గురించైనా సరే మీరు పెట్టే థంబ్ నైల్స్ వల్ల కొన్ని కుటుంబాలు బాధపడుతాయి. దయచేసి మీ వ్యూస్ కోసం ఇలా చేయొద్దు అని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago