Mega Daughter Sreeja: ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల గురించి చర్చ ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా సెలబ్రెటీ కపుల్స్ విడిపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న వారి మధ్య భేదాబిప్రాయాలు రావడంతో విడాకులు కోరుకుంటున్నారు.
గతేడాది నాగచైతన్య- సమంతలు విడిపోవడం టాలీవుడ్ లోనే కాదు అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ధనుష్-ఐశ్వర్య విడిపోడాన్ని కూడా వారి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే మెగా కుటుంబంలో కూడా విడాకుల రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ లు కూడా విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా మెగా పార్టీల్లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం కూడా వార్తలకు బలం చేకూరుస్తోంది. మెగా కాంపౌండ్ లో జరిగిన దీపావళి, దసరా, సంక్రాంతి వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించలేదు. ఇంతే కాకుండా ఇటీవల విడుదలైన కళ్యాణ్ దేవ్ సినిమా ‘ సూపర్ మచ్చి’ ప్రమోషన్లను కూడా మెగా ఫ్యామిలీ లైట్ తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలా ఎన్నో అనుమానాల మధ్య శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్లో తన పేరును శ్రీజ కళ్యాణ్ నుంచి శ్రీజ కొణిదెలకు మార్చుకోవడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో కొంతమంది సెలబ్రెటీల విడాకుల సమయంలో కూడా ఇలాగే సోషల్ మీడియాలో పేర్లను ఛేంజ్ చేసి.. ఆ తరువాత విడాకులను ప్రకటించారు. దీంతో పాటు భర్తతో దిగిన ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్ లో కనిపించడం లేదు… తాజాగా భర్త కళ్యాన్ దేవ్ బర్త్ డే రోజు కూడా శ్రీజ ఎలాంటి ఫోటోలను పెట్టలేదు. మరో వైపు మెగా ఫ్యామిలీ కూడా పెద్దగా స్పందించలేదు.
ఇదిలా ఉంటే కళ్యాణ్ దేవ్ కూతరు నవిష్క మాత్రం స్పందించింది. ఆ చిన్నారికి ఇన్ స్టాలో అకౌంట్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ అకౌంట్ లో కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే దాదా అంటూ.. క్యూట్ గా విషెస్ చెప్పింది. ప్రస్తుతం నవిష్క ముద్దు ముద్దు మాటలు వైరల్ అవుతున్నాయి. ఎంతైనా తండ్రీ, కూతుళ్ల ప్రేమ వేరే అంటూ.. నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…