బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే టికెట్ టు ఫినాలే ఆఫర్ ప్రకటిస్తూ ఇందులో మొదటి రౌండ్ లో భాగంగా కంటెస్టెంట్ లు ఐస్ పై నిలబడి పక్కవారి బాల్స్ తీసుకుంటూ వారి బాల్స్ సేవ్ చేసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలోనే ఈ రౌండ్లో మరోసారి సన్నీ సిరి మధ్య గొడవ చోటు చేసుకుంది. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారంటూ సిరి ఏడ్చేసింది.
ఇకపోతే ఈ టాస్క్ లో భాగంగా ఎక్కువ సేపు ఐస్ పై నిలబడటంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ టాస్క్ పూర్తవగానే వేడినీళ్లలో కాళ్లు పెట్టకూడదని హెచ్చరించారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరి కాళ్ళకి తిమ్మిర్లు రావడంతో వారందరినీ మెడికల్ రూమ్ కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు.
ఇక అర్ధరాత్రి శ్రీరామ్ కాళ్లు బాగా తిమ్మిర్లు రావడం నొప్పి పెట్టడంతో పింకీ అతని కాళ్ళకు జండు బామ్ రాసి ఏకంగా వేడినీళ్లతో కడిగింది. దీంతో శ్రీరామ్ నొప్పి మరింత ఎక్కువైంది. బిగ్ బాస్ వేడి నీళ్లు ఉపయోగించకూడదని హెచ్చరించినప్పటికీ పింకీ అలా చేయడంతో మానస్, కాజల్ అసహనం వ్యక్తం చేశారు.
ఇక పింకీ పని వల్ల శ్రీరామ్ ఎంతో ఇబ్బందిపడటమే కాకుండా అతను నడవడానికి కూడా కష్టతరంగా మారడంతో శ్రీరామ్ కేవలం బెడ్ కి మాత్రమే పరిమితమయ్యాడు. తన వల్ల శ్రీరామ్ ఇంత బాధపడుతుండటంతో పింకీ శ్రీరామ్ కు క్షమాపణ చెప్పింది. ఇక ఈ రౌండ్ లో సన్నీ విజేతగా నిలిచాడు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…