శ్రియా సరన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత శ్రియా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గమనం సినిమాతో డిసెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రియ సరన్ తో పాటుగా శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా శ్రియా సరన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
20 ఏళ్ళు ఇలా మీ ముందు ఉన్నాను. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. నేను ఇంత దూరం వచ్చాను అంటే అందుకు గల కారణం ప్రేక్షకుల ప్రేమ. అదే విధంగా నేను చేసిన కొన్ని సినిమాలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా కొన్ని వర్కవుట్ అవ్వలేదు. నేను సినిమా ఇండస్ట్రీ లో ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీయా.
అదే విధంగా నేను ఎప్పటి వరకు బ్రతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలి అని సినిమాలు చేస్తూనే ఉండాలి అని అనుకుంటున్నాను. ఏఎన్నార్ గారు చివరి క్షణం వరకు కూడా నటించారు.. మనం సినిమా సమయంలో ఒకవేళ నేను చనిపోతే ఆ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరిక్షణం వరకూ నటిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది శ్రియా సరన్. నా కూతురు, నా కుటుంబం నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. అదేవిధంగా సినిమాలో ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను అని తెలిపింది.
గమనం సినిమా కథ వినగానే వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో నేను దివ్యాంగురాలు పాత్రలో కనిపిస్తాను.. వినిపించదు కానీ మాట్లాడతాను.. ఇందులో నటించడానికి కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను.. ఈ సినిమాలో నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర అని చెప్పుకొచ్చింది శ్రియా శరన్. మనిషిలో జరిగే అంతర్గత,సంఘర్షణ ప్రయాణం గురించి చెప్పేదే ఈ గమనం సినిమా. నిస్సహాయతతో ఉండే మనిషి ఒక్కసారిగా బలం వస్తే వాటిని ఒక్కసారిగా అధిగమించే చేస్తాం. అదేవిధంగా నా డెలివరీ సమయంలో కూడా నాకు ఒక భయం ఉండేది కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను అందువల్లే అంత సాఫీగా సాగిపోయింది అని తెలిపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…