దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతి హాసన్ ప్రస్తుతం మరి ఫాంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ తో కలసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్స్ శంతను హజారికాతో కలిసి షాపింగ్ మాల్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఇకపోతే శృతిహాసన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె భుజం పైభాగంలో ఒక టాటూ వేయించుకుంది. అయితే అది తమిళంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు శృతి టాటూ వేయించుకున్న పేరు ఎవరిది అంటూ? కామెంట్లు చేయడంతో ఈ టాటూ పై స్పందించిన శృతిహాసన్ తన భుజాలపై వేసుకున్న టాటూలో ఉన్నది తన పేరేనని.. శృతిహాసన్ పేరును తమిళంలో టాటూ వేయించుకున్నానని ఈ సందర్భంగా తన టాటూ సీక్రెట్ రివీల్ చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే శృతిహాసన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సలార్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అదేవిధంగా తన సోదరి అక్షరహాసన్, రానా దగ్గుబాటితో కలిసి మ్యూజిక్ వీడియో చేశారు. ఈ మ్యూజిక్ వీడియో రానా యూట్యూబ్ ఛానల్ సౌత్ బే కోసం చేసినట్లు తెలియజేశారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…