“కొలవరి… కొలవరి..” అంటూ దేశాన్ని ఉర్రుతలూగించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి ప్రేత్యేకంగా పరిచయం అవసరం లేదు… తమిళంలో ఈ కుర్ర డైరెక్టర్ క్రేజే వేరు… దాదాపు అందరు స్టార్ హీరోలకు వరుసగా సినిమాలు చేసాడు. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ తన పాటలతో అందరికి దగ్గరయ్యాడు కానీ ఆ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ అందుకోకపోవడంతో ఆ తరువాత తెలుగునాట ఆశించిన అవకాశాలు రాలేదు. నానితో “జెర్సీ”, “గ్యాంగ్ లీడర్” రెండు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ కు హీరోయిన్లతో అఫైర్స్ గట్టిగానే ఉన్నాయి. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. పార్టీలు, పబ్బుల్లో హంగామా చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఆ మధ్యలో సూచి లీక్స్ పేరుతో హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియాతో ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే… అనిరుధ్, ఆండ్రియా లిప్ లాక్ చేస్తున్న ఫోటోలు లీక్ అవడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అప్పట్లో అనిరుధ్, ఆండ్రియా ఇద్దరు దీనిపై స్పందించలేదు…
అయితే తాజగా ఇచ్చిన ఒక ఇంటర్వూలో ఈ విషయంపై మాట్లాడిన ఆండ్రియా “అవును అనిరుధ్ తో లిప్ లాక్ ఫోటోలు నిజమే… అందులో తప్పేముంది? అప్పట్లో మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. ప్రేమలో ఇవన్నీ సహజమే కదా.. కానీ అవి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం తప్పు… దానిపై అప్పుడే అనిరుధ్ క్షమాపణలు చెప్పాడు.” అంటూ… చెప్పింది ఆండ్రియా..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…