కరోనా మహమ్మారి వల్ల సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమ కూడా ఎంతలా నష్టపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ఇప్పుడిప్పుడే అన్ని పరిస్థితులు చక్కబడుతున్నాయి అని అనుకునేలోపే మళ్ళీ కోవిడ్ విజృంభణ మొదలైపోయింది.. ఇక గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంత ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాయి. ఇక ఈ మహామ్మారి సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే మాధవన్, అమీర్ ఖాన్ వంటి నటీనటులు ఈ మాహామ్మారి భారిన పడగా.. తాజాగా ఈ జాబితాలో మరో సెలబ్రెటీ కూడా చేరారు.
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరికి నిర్వహించిన పరీక్షలలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం బప్పీలహరి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు బప్పీలహరి.అలాగే తన క్షేమం కోసం ప్రార్ధిస్తున్న ఆయన అభిమానులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు.
బప్పీలహరి అసలు పేరు అలోకేష్ లహరి. ఆయన 1952లో పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురిలో జన్మించాడు. 1972లో బెంగాలీ సినిమా దాడు ద్వారా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 1973లో టీనిషికారిలో పనిచేశాడు. 1975లో విడుదలైన తాహిర్ హుస్సేన్ సినిమా జఖ్మి ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.అటు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,07,889కి చేరింది..అంతేకాదు రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండనున్నట్టు సమాచారం..!!
కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లను నియంత్రించడమే లక్ష్యంగా,…
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలపై ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. విడుదలకు ముందు ప్రచార…
దేశంలో ఇంధన వినియోగం తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు…
తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న కొమ్మాల గ్రామం ఆధ్యాత్మికతతో పాటు రైతు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య…
ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన…