Singer Dhanunjay : శ్రీకాకుళం కి చెందిన సింగర్ ధనుంజయ్ ఇప్పటివరకు అతి తక్కువ కాలంలోనే ఎన్నో పాటలను పాడారు. అది కూడా చిన్న హీరోల నుండి పెద్ధ హీరోల వరకు అందరికీ సాంగ్స్ పాడిన ధనుంజయ్ గారు ఇటీవల పాడిన ‘తిరు సినిమాలోని నా మది పువ్వది’ సాంగ్ తో మరోసారి మంచి హిట్ అందుకున్నారు. నిజంగానే ధనుష్ ఆ పాట పాడాడేమో అనేలా వాయిస్ ధనుష్ కి సరిపోయింది. అతే ధనుంజయ్ పెద్దగా ఇంటర్వ్యూలలో కనిపించకపోవడం వల్ల తాను ఎన్నో పాటలు పాడినా ఆ పాట ధనుంజయ్ పాడాడనే విషయం తెలియదు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పెళ్ళికి ముందే పడిపోయా…
ధనుంజయ్ తన కెరీర్ లో మొదట ట్రాక్స్ పాడుతూ స్టార్ట్ చేసారు. అనూప్ రూబెన్స్ వద్ద మొదలయిన కెరీర్ నేడు అందరు అగ్ర హీరోలకు పాటలు పాడుతూ టాప్ సింగర్ అయ్యాడు. ట్రాక్స్ పాడుతున్న సమయంలోనే గోపీచంద్ ‘లౌక్యం’ సినిమాలో సూడు సూడు సాంగ్ ట్రాక్ పాడగా అది నచ్చి మెయిన్ సింగర్ గా తననే పెట్టుకున్నారు. అలా హిట్ అందుకున్న ధనుంజయ్ మళ్ళీ ‘గోపాలా గోపాల’ సినిమాలో భాజే ఆ డోలు భాజే సాంగ్ కూడా ట్రాక్ పాడగా ఆ పాట విన్న పవన్ కళ్యాణ్ ట్రాక్ పాడిన అతనితోనే పాట కంటిన్యూ చేయమని చెప్పడంతో పవన్ కు పాట పాడే అవకాశం వచ్చిందంటూ చెప్పారు.
ఇక తన వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుతూ పెద్దలు కుదుర్చిన వివాహమే అయినా తనను పెళ్ళికి ముందు కలిసి తన కెరీర్ గురించి అన్ని విషయాలు చెప్పాను. అప్పటికి ఇంకా కెరీర్లో పెద్ధ హిట్స్ కూడా లేవు అంటూ తెలిపారు. అయితే తన భార్య ప్రియాంక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అప్పటికే జాబ్ చేస్తూన్నారట. తాను నువ్వు నీ కెరీర్ కోసం కష్టపడు నేను ఫైనాన్సియల్ గా సపోర్ట్ గా ఉంటాను అని భరోసా ఇచ్చిందని, తాను కెరీర్ లో ఇంత ఎదగడానికి తానిచ్చిన సపోర్ట్ కారణం అంటూ పెళ్ళికి ముందే తనకు పడిపోయానంటూ చెప్పారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ధనుంజయ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…