Categories: FeaturedMovie News

Singer Revanth: బిగ్ బాస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రేవంత్…రేవంత్ మంచి ప్లే బాయ్ అంటూ పంచ్ వేసిన నాగార్జున!

Singer Revanth: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలోకి ఒక్కో కంటెస్టెంట్ ఎంత ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 21వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా వేదికపైకి రేవంత్ రాగానే నాగార్జున రేవంత్ మంచి ప్లే బాయ్ అంట కదా అంటూ పంచ్ వేశారు. నాగార్జున ఇలా అడిగేసరికి వెంటనే రేవంత్ సర్ ఈషో మా ఆవిడ చూస్తుంది అంటూ బదులిచ్చారు.   ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి రావడంతో తన భార్యను చాలా మిస్ అవుతున్నానని రేవంత్ ఈవేదికపై చెప్పడంతో నాగార్జున రేవంత్ కు చిన్న సర్ప్రైస్ ఇస్తూ తన భార్యను వేదిక పైకి తీసుకువచ్చారు.అయితే ప్రస్తుతం తాను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అని తెలియజేయడమే కాకుండా ఈ సమయంలో బిగ్ బాస్ కార్యక్రమానికి రావాలా వద్దా అంటూ చాలా సార్లు ఆలోచించాలని రేవంత్ తెలిపారు.     అయితే తన భార్య బలవంతం చేయడంతోనే తాను ఈ కార్యక్రమంలోకి వచ్చానని ఎలాగైనా టైటిల్ గెల్చుకొని బయటికి వెళ్తానంటూ ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ఇలాంటి సమయంలో తన భార్య పక్కన ఉండాల్సిన తాను బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నానని తన భార్యను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈ సందర్భంగా రేవంత్ కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.  

Singer Revanth: ఇండియన్ ఐడల్ విజేతగా గుర్తింపు….

ఇకపోతే ఈయన ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అదేవిధంగా రేవంత్ ఇండియన్ ఐడల్ విజేతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా రేవంత్ కీరవాణి, చక్రి, మణిశర్మ, తమన్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి గుర్తింపు సంపాదించుకున్న ఈయన బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఎలాగైనా టైటిల్ గెల్చుకోవాలనే కసితో లోపలికి వెళ్లిన రేవంత్ ఎలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago