Singer Revanth: సింగర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ రేవంత్ తండ్రి అయ్యారు. రేవంత్ భార్య అన్విత నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఇక ఈ విషయాన్ని రేవంత్ సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతుండగానే తన భార్య బిడ్డకు జన్మనిచ్చారు. రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే సమయానికి అన్విత 7 నెలల గర్భిణీ. ఇక ఈయన బిగ్ బాస్ లోకి ఎంట్రీ అయ్యే ముందు అన్విత కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు.అలాగే పలుమార్లు రేవంత్ గర్భిణీ స్త్రీగా ఉన్నటువంటి తన భార్యను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన సమయంలో రేవంత్ తన భార్య కూడా వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ రేవంత్ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి రాగా అన్విత కోసం బిగ్ బాస్ వీడియో కాల్ ద్వారా రేవంత్ తో మాట్లాడించారు.ఇక ఈయన హౌస్ లో ఉండగానే అన్విత సీమంతం కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోని కూడా బిగ్ బాస్ రేవంత్ కోసం స్పెషల్ గా ప్లే చేశారు.
ఇలా తరుచు తన భార్యను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయినటువంటి రేవంత్ తండ్రి అయ్యారనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా రేవంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి రేవంత్ కి బిగ్ బాస్ ఈ విషయాన్ని చెప్పి ఎలా సర్ప్రైజ్ చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…