Hero srikanth : ఒక్కో మెట్టు ఎక్కుతూ విలన్ గా మొదలై సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఆ తరువాత సోలో హీరోగా ఎదిగిన శ్రీకాంత్ తన కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసారు. ఇక ఎక్కువ శాతం మల్టీ స్టారర్ చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో మంచి హిట్స్ అందుకున్న శ్రీకాంత్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా నేను చేయగలనని నిరూపించాడు ఖడ్గం సినిమాతో. అందులో పోలీస్ ఆఫీసర్ రాధ కృష్ణ గా అందరినీ ఆకట్టుకున్నాడు. అసలు ఆ పాత్రకు శ్రీకాంత్ ఎలా సెలెక్ట్ అయ్యాడో తెలుసా…
శ్రీకాంత్ ను వద్దన్న నిర్మాత… రెండు కోట్లు ఎక్కువ ఇస్తానంటూ ఆఫర్…
ఖడ్గం సినిమా.. దేశభక్తి అనగానే ఈ సినిమా, ఈ సినిమా పాటలే మన తెలుగు ప్రేక్షకులకు గుర్తొస్తాయి. అలాంటి ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ వంశీ డ్రీం ప్రొజెక్ట్, విద్యార్థి దశలోనే విప్లవ భావాలు కలిగిన కృష్ణ వంశీ కి దేశభక్తి కి సంబంధిచిన ఒక సినిమా తీయాలనీ ఎప్పటినుండో కోరిక. ఇక అప్పటికే మురారి వంటి కుటుంబ కథా చిత్రంతో హిట్ ఎందుకున్న ఆయన ఈ సినిమాను ముంబై దాడుల నేపథ్యంలో తీయాలనీ భావించినా సీరియస్ గా కథ నడిపించకుండా కొంత కమర్షియల్ హంగులను జోడించాలని మూడు పాత్రలలో ఒకటి ముస్లిం పాత్ర, ఒక సీరియస్ పోలీస్ పాత్ర, అలానే హీరో అవ్వాలనుకుంటున్న ఒక యువకుడి పాత్రను తీసుకుని కథ నడిపాడు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముస్లిం పాత్రకు అలాగే హీరో అవ్వాలంటూ ఒక్క ఛాన్స్ అనే యువకుడిగా రవితేజ సెలెక్ట్ అయ్యారు. ఇక శ్రీకాంత్ ను పోలీస్ ఆఫీసర్ గా కృష్ణ వంశీ అనుకుంటే నిర్మాత ఫ్యామిలీ హీరో అతను వద్దు అని చెప్పాడట మధు సుంకర. ఇక శ్రీకాంత్ ను పిలిపించి నిర్మాత ముందే ఉన్నది చెప్పాడట. కృష్ణ వంశీ అయితే మధు సుంకర ఓపెన్ గా మీరు ఫ్యామిలీ హీరో ఇలాంటి సీరియస్ పాత్రలు మీకు బాగుండవని నా అభిప్రాయం అంటూ చెప్పారట. ఇక శ్రీకాంత్ ను తీసుకోక పోతే ఇంకో రెండు కోట్లు ఎక్కువిస్తానని ఆఫర్ కూడా ఇచ్చారట కానీ కృష్ణవంశీ శ్రీకాంత్ కావాలని పట్టు బట్టి తీశారు. ఇక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ ఆధరగొట్టిన విషయం అందరికీ తెలుసు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…