Singer Smitha: సింగర్ స్మిత పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్, పాప్ సింగర్, యాక్ట్రెస్, హోస్ట్ అండ్ బిజినెస్ వుమెన్‌గా డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో రాణించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈమె హోస్ట్ గా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఒకప్పుడు బుల్లితెరపై మాత్రమే టాక్ షోలు ప్రసారమయ్యేవి ఎప్పుడైతే ఓటీటీలకు ఆదరణ వచ్చిందో అప్పుడు ఓటీటీలలో కూడా టాక్ షోలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే సోనీ లీవ్ లో స్మిత వ్యాఖ్యాతగా నిజం విత్ స్మిత అనే టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ఇక ఈ కార్యక్రమం కంటే ముందుగా స్మిత తన టాక్ షో గురించి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ గురించి ఫిల్మీ లుక్స్ స్మితను ఇంటర్వూ చేసింది.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ గురించి ప్రశ్నించగా తన జీవితంలో బందిపోటు రహస్యాలు ఏమీ లేవని తన లైఫ్ అందరి లైఫ్ లాగే చాలా సంతోషంగా ముందుకు వెళుతుందని తెలిపారు. తన ఇంట్లో అందరం కష్టపడుతూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. చాలా ఫ్రీడం ఇస్తామని తెలియజేశారు. తన కుమార్తె గురించి చెబుతూ తానే నా ప్రాణం అని తెలిపారు.
ఇక తన జీవితంలో జరిగిన ఏదైనా అద్భుతం ఉంది అంటే అది తన కుమార్తె శివి పుట్టడమేననీ తెలిపారు.. ‘మహానటి’ లో తనను బాలనటిగా పరిచయం చేయడానికి గల కారణాలను కూడా స్మిత వెల్లడించారు.
శివి ఫోకస్ అంతా మ్యూజిక్ మీదనే ఉందన్నారు. అలాగే షోకి వచ్చిన వచ్చిన చంద్రబాబు నాయుడులో మరో కోణాన్ని చూస్తారనీ, చిరంజీవిలోని కామెడీ టైమింగ్‌తో పాటు.. పొలిటికల్ అనుభవాల గురించి ఈ షోలో చర్చించబోతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…