సినిమా లోకమంటేనే ఓ రంగుల ప్రపంచం. ఊహకందని భూతల స్వర్గం. ఊహ నిజమైతే అదృష్టం.. ఊహలకూ.. వాస్తవానికి సంబంధం లేకుండా మోసపోతే జీవితం నరకమే. సినిమా రంగంలో తమకున్న ప్రతిభతో ఒక వెలుగు వెలుగుదామని ప్రయత్నించే కొందరి బలహీనతలను ఆసరాగా తీసుకుని వాళ్ళకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడే నమ్మకద్రోహుల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా సింగర్ సునీత మేనల్లుడినని చెప్పి చైతన్య అనే వ్యక్తి సరిగ్గా ఇలాంటి మోసాలే చేస్తుండటంతో.. ఈ సంగతి తెలుసుకున్న సింగర్ సునీత వెంటనే తనకు చైతన్య అనే మేనల్లుడు లేడని, దయచేసి ఎవరూ అతని వలలో పడి మోసపోవద్దంటూ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత మాట్లాడుతూ.. ‘‘నేను అందరికీ ఒక విషయం గురించి క్లారిటీగా చెబుతున్నాను. చైతన్య అనే వ్యక్తి నా మేనల్లుడినని చెప్పి, సినిమా రంగంలోని కొందరు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటున్నాడట. సినిమా ఛాన్సులు ఇప్పిస్తానంటూ అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిసి షాకయ్యాను. నాకసలు చైతన్య అనే మేనల్లుడే లేడు. అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. దయచేసి అతని మాటలు నమ్మి ఎవరూ మోసపోకండి. ఫిల్మ్ నగర్లో ప్రతి రోజూ ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తూనే ఉన్నాయి. అయినా ఎలా మోసపోతున్నారో అర్ధం కావడం లేదు. ఫలానా సినిమా హీరోయిన్ నా బంధువు అనగానే ఎందుకు వారికి డబ్బులిచ్చి మోసపోతున్నారు.? కొంచమైనా ఆలోచించరా.? బయటి వ్యక్తులెవరైనా ఈవిధంగా మాయ మాటలు చెప్పి సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని మిమ్మలను నమ్మించే ప్రయత్నం చేస్తే ఇకనుంచైనా కాస్త ఆలోచించండి. డబ్బులు పోగొట్టుకోండి.’ అని సునీత తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…