SIR Movie: పూజా కార్యక్రమాలతో మొదలైన ‘సర్’మూవీ..ఆ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం..!
SIR Movie: వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ ద్విభాషా చిత్రం తెలుగులో సర్ అనే టైటిల్ ను ఖరారు చేయగా.. తమిళంలో ‘వాతి’ అనే పేరుతో వస్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో అధికారిక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ షూటింగ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి క్లాప్ కొట్టాడు. దీంతో షూటింగ్ కంటిన్యూ అయింది. దీనిలో హీరోగా ధనూష్ , హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని సినీ సభ్యులు పేర్కొన్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల ఫొటోలను చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా పంచుకన్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ధనుష్ క్యాజువల్ వైట్ షర్ట్ , ప్యాంట్‌లో అందంగా కనిపిస్తుండగా.. సంయుక్త వెరైటీ డ్రస్ తో అలరించింది.
ఈ రోజు నుంచి శరవేగంగా హైదరాబాద్ లోనే షూటింగ్ మొదలు అవుతుందని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ద్వారా ధనుష్ మొదటి సారిగా డబ్బింగ్ లో కాకుండా.. తెలుగులో ఫుల్ లెంగ్త్ సినిమాలో అడుగు పెట్టాడు. ధనూష్ శేఖర్ కమ్ములతో కూడా మరో ప్రాజెక్ట్ ను తెలుగులో చేయనున్నాడు. దాని కంటే ముందే.. రంగ్ దే నిర్మాత వెంకీ అట్లూరితో ముందుగా ఈ సర్ సినిమాతో ప్రేక్షకులను అరించనున్నాడు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తర్వాత సంయుక్త మీనన్ నటిస్తున్న రెండవ తెలుగు సినిమా కూడా ఇదే. ఎడ్యుకేషన్ మాఫియా గురించి చెప్పే పీరియాడికల్ సోషల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన పోరాటాన్ని ఈ చిత్రం చూపిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంగీత దర్శకుడిగా జివి ప్రకాష్ , సినిమాటోగ్రఫీ దినేష్ కృష్ణన్ పని చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…