బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో బిగ్ బాస్ షో గురించి, అలాగే ఆ షో కు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలు గొడవలతో రోజుకొక విధంగా మారుతోంది. బిగ్ బాస్ కార్యక్రమంలో తాజాగా హౌస్ మేట్స్ వారి జీవితంలో జరిగిన పలు ఎమోషనల్ విషయాల గురించి పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కంటెస్టెంట్ లో ఎమోషనల్ కూడా అయ్యారు.
మొదటగా తనే మాట్లాడుతూ ముగ్గురు అబ్బాయిలను తన తల్లి ఒక్కరే పెంచారని, ఆ కష్టము ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అంటూ తన తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత జెస్సీ నాకు పుట్టుకతోనే గొంతు సమస్య ఉందని, అయినప్పటికీ నేను ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగాను. గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించాను. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అమ్మాయి ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని చెప్పుకోదు అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత ప్రియా మాట్లాడుతూ పెళ్లి అనంతరం యాక్టింగ్ మానేశాను, ఆ తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఒక బాబు కూడా పుట్టాడు. కానీ లైఫ్ లో సెటిల్ కాలేదు అంటూ ప్రియా ఎమోషనల్ అయ్యింది. సిరి హనుమంతు మాట్లాడుతూ మా ఊరిలో తల్లి ఏమైనా పద్దతిగా ఉందా కూతురు పద్ధతిగా ఉండడానికి అని చాలామంది అన్నారు అంటూ సిరి ఎమోషనల్ అయ్యింది. ఇక చివరిగా మా ఊరి వారికి మా బంధువులకు నేను చెప్పేది ఏమిటంటే నేను పద్ధతిగానే పెరిగాను పద్ధతిగానే ఉంటున్నాను అంటూ సిరి సమాధానమిచ్చింది.
ఇక సిరి విషయానికి వస్తే ఈమె గురించి ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…