Sitara: సితార ఘట్టమనేని పరిచయం అవసరం 11 సంవత్సరాల వయసులోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సితార ఇప్పటికే పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పిఎంజె నగల తయారీ సంస్థకు ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ నగల దుకాణాన్ని ప్రారంభించారు ఈ క్రమంలోనే సితార మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఇలా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈమె మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే తన మొదటి యాడ్ కోసం సితార తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఏం చేశారు అనే విషయాన్ని ప్రశ్నించారు. దీనికి సితార సమాధానం చెబుతూ తన మొదటి రెమ్యూనరేషన్ చారిటీకి డొనేట్ చేసానని తెలిపారు.
ఈ యాడ్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ కోటి రూపాయలను ఈమె చారిటీ కోసం విరాళంగా ప్రకటించారన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున సితార మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసులో సితార చిన్నదే అయినప్పటికీ తన మనసు మాత్రం చాలా పెద్దది అంటూ ఈమె పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు తన చారిటీ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన తండ్రి అడుగుజాడల్లోనే సితార కూడా నడుస్తుందని అందుకే తన వంతుగా తన మొదటి రెమ్యూనరేషన్ కోటి రూపాయలను చారిటీకి ప్రకటించింది అంటూ ఈమె పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…