Categories: FeaturedMovie News

Sivabalaji and Madhumitha : మా మధ్య మనస్పర్ధలు ఉన్నాయి… కాంట్రవర్సీ అవుతుందని భయమేసింది..: మధుమిత & శివబాలాజీ

Sivabalaji and Madhumitha : ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ బాలాజీ ఆ తరువాత ఎలా చెప్పను, దోస్త్ సినిమాల్లో నటించారు. అయితే శివ బాలాజీ కి మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం ఆర్య. బన్నీ నటించిన ఆర్య సినిమాలో విలన్ షేడ్ ఉన్న పాత్రలో అజయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత సంక్రాంతి సినిమాతో మరో మంచి హిట్ అందుకున్న శివ బాలాజీ తన 17 ఏళ్ళ వయసులోనే తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ 22 ఏళ్లకే సొంత వ్యాపార సంస్థలను పెట్టాడు. ఇక సినిమాల మీద ఆసక్తితి ఇండస్ట్రీ వైపు వచ్చిన శివ బాలాజీ నటి మధుమిత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక వారి లవ్ స్టోరీ, వైవాహిక జీవితం గురించిన ముచ్చట్లను అలాగే తన సినిమాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మధు శివబాలాజీ పంచుకున్నారు.

ఎక్కడైనా మనస్పర్థలు… సినిమాలో పచ్చి నిజాలు…

శివబాలాజీ మధుమిత లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వారి వైవాహిక జీవితం ఎలా సాగుతోందన్న ప్రశ్న ఎదురవగా చాలా హ్యాపీగా ఉందని శివబాలాజీ చెప్పారు. ఇక మధుమిత మాట్లాడుతూ పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులకు వేరేలా లైఫ్ స్టైల్ ఉంటుంది, అలాంటిది పెళ్లితో ఒక్కటయ్యాక వారి లైఫ్ స్టైల్స్ ఒక్కటవ్వటానికి కొంచం సమయం పడుతుందని అంటూ మగవారు ఎక్కువగా ఫ్రెండ్స్, వర్క్ అని ఉంటారు. ఆడవాళ్ళు చాలా వరకు భర్త వీలైనంత ఎక్కువ సమయం వారితోనే గడపాలని అనుకుంటారు. కానీ ఇద్దరూ కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఎటువంటి మనస్పర్థలు ఉండవు అని అన్నారు.

ఇక శివబాలాజీ తన సినిమాల గురించి చెబుతూ కొన్ని నెలల క్రితం ‘రెక్కీ’ అనే సినిమాలో నటించానని అది మంచి హిట్ అయ్యిందని చెప్పారు. అలానే ఇంకొక సినిమా ‘సింధూరం’లో నటించానని, ఈ చిత్ర నేపథ్యం నక్సల్స్ ఇంకా రాజకీయం చుట్టూ ఉన్న నిజానిజాల చుట్టూ ఉంటుందని చెప్తూ సినిమా చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అని చాలా భయమేసింది అని కాకపోతే డైరెక్టర్ శ్యామ్ చాలా నాలెడ్జిడ్ పర్సన్, తాను తీస్తున్న విధానం బాగుందని, అతను దైర్యం చెప్పడంతో ప్రాజెక్ట్ చేశానని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago