Sivaji: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోని నటుడు శివాజీ గతంలో తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలితారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈయన గత కొద్దిరోజులుగా మౌనం వహిస్తున్నప్పటికీ తాజాగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఎంతో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పవన్ అభిమానులు విపరీతంగా ఉన్నారని అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సరిగా ఫోకస్ చేయలేదు అంటూ వెల్లడించారు. ఆయన వద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. అయితే అవి ఎప్పుడు ఉపయోగించాలో తనకు తెలియడం లేదని వెల్లడించారు.
ప్రస్తుతం మనం సాధారణ పవన్ కళ్యాణ్ ను మాత్రమే చూస్తున్నాము. ఆయనలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తి బయటపడినప్పుడు ఆయన అస్త్రాలను సరైన సమయంలో ఉపయోగించినప్పుడు పవన్ కళ్యాణ్ తప్పకుండా సీఎం అవుతారని శివాజీ వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ను జగన్ తో పోలుస్తూ ఈయన కామెంట్ చేశారు. జగన్ దేనిపైనైనా ఫోకస్ పెడితే తప్పకుండా సాధిస్తారని అలాగే ఆయన ఏపీలో అధికారంలోకి వచ్చారని తెలిపారు.
జగన్ మాదిరిగా పవన్ రాజకీయాలపై ఫోకస్ చేయలేదని అలా ఫోకస్ చేసిన రోజున ఈయన గొప్ప నాయకుడు అవుతారని, తాను బలంగా అనుకుంటే అన్ని అయిపోతాయి సామి అంటూ మహేష్ బాబు ఖలేజా సినిమా స్టైల్ లో శివాజీ పవన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…