Samantha: నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత వెబ్ సిరీస్ లలో, సినిమాలలోనూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. సమంత విడాకులు తీసుకున్న తర్వాత పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ ఊ..ఊఅంటావా మామ అనే స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇలా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ఈమె నటించడం వల్ల ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో సమంతకు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈమె వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
ఇక పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేసిన సమంత పుష్ప 2 సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేయబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తనకు ఇదే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ మీరు ఊహించిన విధంగా తాను ఏ విధమైనటువంటి స్పెషల్ సాంగ్స్ చేయలేదని సమంత క్లారిటీ ఇచ్చారు.ఇలా సమంత స్పెషల్ సాంగ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు ఖుషి సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…