Featured

Megastar Chiranjeevi : మెగాస్టార్ కొత్త కారు… ఆ ఫ్యాన్సీ నెంబర్ కోసం అంత ఖర్చు చేశారా…!

Megastar Chiranjeevi : సెలబ్రిటీస్ అంటే మామూలుగా ఉంటుందా.. వారు వేసే బట్టల నుండి పెట్టే వాచ్ ల వరకు అన్నీ బ్రాండెడ్ అందులోనూ ఖరీదైనవి ఉంటాయి. ముఖ్యంగా కుర్ర హీరోలు వాడే గాడ్జెట్స్ అలాగే వాచ్ లను నెట్ లో వెతికి మరీ యూత్ అంత కాస్ట్లీనా అంటూ చర్చించుకోవడం మామూలే. ఇక మన తెలుగు హీరోలు ఇందుకు మినహాయింపు కాదు. కార్లు అలాగే బైకుల దగ్గర నుండి గాడ్జెట్స్ వరకు కాస్ట్లీ అందులోనూ బ్రాండెడ్ తో దర్శనిమిస్తుంటారు. ఇక తెలుగు హీరోల్లో కార్ల మోజు అనగానే నాగచైతన్య, రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ గుర్తొస్తారు. అయితే ఈసారి మాత్రం కొత్త కారు కొని దాని రిజిస్టర్ నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేసి మెగాస్టార్ వార్తల్లో నిలిచారు.

వెల్ఫైర్ కారు కొన్న చిరు…

చిరు దగ్గర ఎన్నో మోడల్ కార్స్ ఉన్నాయి. అందులోనూ కొడుకు రామ్ చరణ్ తన తండ్రికి ప్రేమగా రోల్స్ రాయిస్ కారును కూడా గిఫ్ట్ ఇచ్చారు. అయితే కొత్తగా చిరు మళ్ళీ కారు కొన్నారు. కోటికి పైనే ఖరీదు ఉన్న టొయోటా వెల్ఫైర్ కారును కొన్నారు. అయితే అందులో ఏముంది విశేషం అంటారా. కారు ధర ఏమో కానీ కారు రిజిస్ట్రేషన్ కోసం ఫ్యాన్సీ నుంబర్ కోసం మాతం అక్షరాలా 5 లక్షలు ఖర్చు చేసారు.

1111 ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆయన అంత డబ్బు ఖర్చు చేశారట. టిఎస్ 09 జిబి 1111 రిజిస్ట్రేషన్ కోసం లక్షల్లో ఖర్చు చేసారు మెగాస్టార్. ఇక ఈయనే కాదు జూనియర్ ఎన్టీఆర్ కూడా వెల్ఫైర్ కారునే ప్రస్తుతం వాడుతున్నారు. మంచి ఫీచర్స్ ఉండటంతోనే ఈ కారు కొనుగోలు చేస్తుండగా ఎన్టీఆర్ కూడా 9 నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేశారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago