Snigdha : ‘అలా మొదలైంది’ సినిమాతో సినిమా ప్రయాణం మొదలు పెట్టిన స్నిగ్ధ తాను ఇండస్ట్రీకి సింగర్ కావాలని వచ్చి యాక్టర్ అయింది. నందిని రెడ్డి సినిమాతో అవకాశం అందుకుని మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న స్నిగ్ధ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా కొన్ని చిత్రాలలో పాటలు పాడింది. ఇక దాదాపు యాభై కి పైగా సినిమాల్లో నటించిన స్నిగ్ధ తన వేషధారణ అందరిలా కాకుండా భిన్నంగా ఉండటం వల్ల మరింత గుర్తింపు దక్కించుకుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఇష్టమున్న స్నిగ్ధ కిరణ్ బేడీ గారంటే చాలా ఇష్టం, స్ఫూర్తి అంటూ చెప్తోంది.
నా వెనక ఎన్టీఆర్ అలా చేసేవాడు…
సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నిగ్ధ నటించడం రాదు ఇప్పటికీ అంటూ చెబుతుంది. బయట ఫ్రెండ్స్ తో ఎలా ఉంటానో అలానే సినిమాల్లో కూడా చేయడం వల్ల ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది. ఇక శివ మాల ప్రతి ఏడాది తీసుకునే స్నిగ్ధ ఆ సమయంలో సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం వల్ల సన్నబడి పోతాను మళ్ళీ దీక్ష అయ్యాక సినిమాల కోసం లావుగా అవుతాను అంటూ తన పద్ధతుల గురించి చెప్పింది.
ఇక కమెడియన్స్ సన్నగా అవడం లావుగా అవ్వడం సహజమే అంటూ మాట్లాడుతూ హీరోలలో ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమంటూ చెప్పింది. దమ్ము సినిమాలో నటించిన సమయంలో ఎన్టీఆర్ స్నిగ్ధను అనుకరించేవాడట. డైరెక్టర్ బోయపాటి శీను కి యాక్షన్స్ సీన్స్ లో దెబ్బలు తినాల్సి వస్తే నా డూపర్ గా స్నిగ్ధ నూ పెట్టుకో అంటూ చెప్పేవాడట. స్నిగ్ధ వెనకాల నిల్చొని తాను ఎలా నిలబడుతుందో అనుకరిస్తూ ఆటపట్టించేవాడంటూ ఎన్టీఆర్ గురించి స్నిగ్ధ తన అనుభవాలను పంచుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…