Sobhita Dhulipala: మేజర్, కురుప్, గూడచారి, పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శోభిత ధూళిపాళ్ల. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందిన ఈమెను కనుక చూస్తే ముంబైకి చెందిన హీరోయిన్ అనుకుంటారు కానీ ఈమె తెలుగు హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు.
ఇకపోతే శోభిత గత కొంతకాలంగా అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వీరి డేటింగ్ వార్తలు తెర పైకి వచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని శోభిత నాగచైతన్య ఇద్దరు కూడా ఈ వార్తలను ఖండించారు.ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా తనకు ఇండస్ట్రీలో జరిగినటువంటి ఒక చేదు సంఘటన గురించి కూడా తెలియజేశారు.
తనకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక షాంపూ యాడ్ కార్యక్రమంలో ఆడిషన్స్ జరుగుతూ ఉండగా వెళ్లాను అక్కడి మేకర్స్ నన్ను చూసి బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా పనికి రావని నన్ను హేళన చేసి మాట్లాడారు.ఇలా మాట్లాడటంతో నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చాను.
ఇలా ఎవరైతే నన్ను అవమానించారో ప్రస్తుతం అదే షాంపుకు తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాను అంటూ ఇండస్ట్రీలో తనకు జరిగినటువంటి అవమానాన్ని గురించి తెలియజేస్తూ అవమానాలను దాటుకొని తాను ఎలా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారో కూడా ఈమె తెలియజేశారు. ప్రస్తుతం శోభిత చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…