Movie News

Josh Ravi: జబర్దస్త్ వాళ్లతో ఫోటోలు అడిగితే హీరోల మాదిరిగా బిల్డప్ ఇస్తారు… హైపర్ ఆది అలా మెసేజ్ చేసేవాడు: జోష్ రవి

Josh Ravi: సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుని నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జోష్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ జబర్దస్త్ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.

ప్రస్తుతం జోష్ రవి జబర్దస్త్ నుంచి విడిపోయారు. పలు సినిమాలలో అవకాశాలు రావడంతోనే తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు. కాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎన్నో కష్టాలు పడ్డానని అయితే తనకు బాగా పరిచయమున్న దర్శకులు నిర్మాతలు కారణంగా తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలియజేశారు.

ఇకపోతే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న తనకు ఏ దర్శకుడితో ఏ విధమైనటువంటి విభేదాలు లేవని, ఒక షార్ట్ తీసేటప్పుడు ఎన్నిసార్లు టేక్ లు తీసుకుంటారని అడిగిన డైరెక్టర్ ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు అంటూ రవి వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలామంది తనుపెద్ద సెలబ్రిటీ అని భావిస్తుంటారు. ఇకపోతే మా ఊరికి కనుక వెళ్తే ఊరు మొత్తం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి, తనపై అభిమానాన్ని చూపిస్తూ ఉంటారని వెల్లడించారు.

జబర్దస్త్ లో వాళ్లంటే ఇష్టం..


ఇక బయట మేము కనుక కనబడితే పెద్ద ఎత్తున ఫోటోలు కోసం ఎగపడతారని జోష్ రవి వెల్లడించారు. ఇక జబర్దస్త్ వాళ్ళతో ఫోటోలు కోసం వెళితే వాళ్లు పెద్ద హీరోలంటూ బిల్డప్ ఇస్తారు. అయితే అది ఆ క్షణం వరకు మాత్రమే.. ఆ తర్వాత తిరిగి మనం ఏంటో మనకు తెలుసు కనుక హీరో అనే ఊహ నుంచి బయటకు రావాలని ఆయన వెల్లడించారు.ఇక జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటానని జబర్దస్త్ వారితో తనకు మంచి అనుబంధం ఉందని జోష్ రవి తెలిపారు. ఇక జబర్దస్త్ లో తాను సుడిగాలి సుధీర్ హైపర్ ఆదికి ఫేవరెట్ అని తెలిపిన జోష్ రవి వారి స్కిట్లు కనుక బాగా ఉంటే నేను చాలా అద్భుతంగా ఉంది అంటూ మెసేజ్ చేస్తాను. వాళ్లు కూడా నాకు నీ పర్ఫామెన్స్ బాగుంది, సినిమాలు బాగున్నాయని మెసేజ్ చేస్తారని, హైపర్ ఆది ఎప్పుడు కూడా ఇలాగే మెసేజ్ చేస్తారని ఈ సందర్భంగా జోష్ రవి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago