ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోవడంతో పాటు చాలామంది తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ లో తమకు తెలియకుండానే నగదు కట్ అయిందని ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిజిటివ్ లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో మోసపూరిత లావాదేవీలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
చాలామంది బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్టు సందేశాలు వచ్చిన వెంటనే ఏం చేయాలో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసపూరిత లావాదేవీల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే వెంటనే అకౌంట్ లావాదేవీలను క్యాన్సిల్ చేసుకోవాలి.
డబ్బులు కట్ అయిన లావాదేవీ గురించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఖాతా నుంచి డబ్బులు కట్ అయిన విషయాన్ని తెలియజేయడంతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. అనంతరం బ్యాంక్ బ్రాంచ్ లో సంప్రదించి డబ్బులు కట్ అయిన విషయం చెబితే వాళ్లు డబ్బులు కట్ కావడానికి గల కారణాన్ని తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తారు. బ్యాంక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీలైనంత తక్కువ సమయంలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది.
నగదు ఏ విధంగా డెబిట్ అయిందో తెలుసుకుని బ్యాంక్ అధికారులు వీలైనంత తక్కువ సమయంలో ఆ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తారు. ఖాతాలో నగదు కట్ అయిన వెంటనే ఏ మాత్రం టెన్షన్ పడకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తే మంచిది.
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…