Categories: General News

Ahmadabad Plane Crash : భవనంలోకి విమానం దూసుకెళ్లింది.. హాస్టల్‌లోని రెండో అంతస్తు నుంచి దూకిన కుమారుడు – గుండెలు పిండేసే తల్లి ఆవేదన!

గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను విషాదం చోటు చేసుకుంది. లండన్‌కు బయలుదేరిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటన మేఘనీగర్ ఘెడాసర్ క్యాంప్ ప్రాంతంలోని జనారణ్యంలో జరిగింది. విమానం రెండు బహుళ అంతస్తుల భవనాలపై కూలడంతో ఒక్కసారిగా భీకర వాతావరణం నెలకొంది.

Son jumps from second floor of hostel – Heartbreaking mother’s anguish!

రమీలా అనే మహిళ తన కుమారుడి గురించి ఆందోళనగా మీడియాతో మాట్లాడుతూ.. “నా కొడుకు హాస్టల్‌లో ఉన్నాడు. లంచ్ బ్రేక్ కావడంతో భోజనం చేయడానికి వెళ్ళాడు. ఇంతలో విమానం హాస్టల్‌పై కూలిపోయింది. నా కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఫోన్‌లో మాట్లాడినప్పుడు, భయంతో వణికిపోతూ రెండో అంతస్తు నుంచి దూకేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతనికి గాయాలయ్యాయి” అని కన్నీటి పర్యంతమయ్యారు.

అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వద్ద పూనమ్ పటేల్ అనే యువకుడు తన వదిన గురించి దిగులుగా వివరిస్తూ.. “మా వదిన లండన్‌కు వెళ్తోంది. విమానం ప్రమాదానికి గురైందని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఆమె ఎలా ఉందో తెలియక చాలా కంగారుగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

విమాన ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రయాణికుల బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారి ఆర్తనాదాలతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.

విమానం కూలిన సమయంలో లంచ్ బ్రేక్ కావడంతో చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు హాస్టల్‌లోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago