Sonam Kapoor: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయన వ్యాఖ్యతగా కాఫీ విత్ కరణ్ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా ప్రముఖ నటుడు అర్జున్ కపూర్, ఆయన సోదరి సోనమ్ కపూర్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే కరణ్ టాక్ షో అంటేనే సెలబ్రిటీలకు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలబ్రిటీలు హాజరుకాగా వారందరినీ కరణ్ శృంగారం గురించి ప్రశ్నించడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తన ముందు ఏ హీరో హీరోయిన్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఇలాంటి శృంగార ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే సోనమ్ కపూర్ కి కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. అర్జున్ కపూర్ ఇప్పటివరకు ఎంతమంది నీ స్నేహితులతో బెడ్ షేర్ చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాకు అలాంటి బ్రదర్స్ ఎవరూ లేరని సమాధానం చెప్పింది.
ఇలా ఈమె సమాధానం చెప్పడమే కాకుండా మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ నా బ్రదర్స్ ఎవరిని వదలడం లేదంటూ చిన్న హింట్ ఇచ్చారు. ఇలా ఈమె సమాధానం చెప్పడంతో వెంటనే అర్జున్ అసలు మీరు ఇక్కడికి నన్ను ఎందుకు పిలిచారు అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా సోనమ్ తన బ్రదర్ గురించి అలా చెప్పడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే రక్షాబంధన్ సందర్భంగా అన్నాచెల్లెళ్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి కరణ్ ఇలాంటి ప్రశ్నలు అడగడంతో పలువురు నెటిజన్ లు ఆయన తీరుపై మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…