General News

వినాయకుడి లడ్డూలను దొంగతనం చేసిన యువకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

మీకు బిచ్చగాడు సినిమా గుర్తుందా.. అందులో హీరో తన తల్లి కోసం,తన తల్లి ఆరోగ్యం కుదటపడడం కోసం ఏకంగా బిచ్చగాడుగా మారి దీక్షచేసి తన తల్లిని బ్రతికించుకుంటాడు. అచ్చం బిచ్చగాడు సినిమాను తలదన్నేలా ఇద్దరు యువకులు తనతల్లి ఆరోగ్యం కోసం ఏకంగా దొంగతనానికి పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు తన తల్లి గత ఆరు నెలల నుంచి అనారోగ్యం పాలవడంతో ఎన్నో ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించినప్పటికీ ఏ విధమైన ఫలితం లేదు. ఈ క్రమంలోనే ఒక పూజారి వినాయకుడి మండపాల వద్ద పెట్టిన లడ్డు దొంగతనం చేసి తన తల్లికి తినిపించడం వల్ల తన ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు.

దీంతో ఆ ఇద్దరు యువకులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గత మూడు రోజుల నుంచి వేములవాడ పట్టణంలో పెట్టినటువంటి వినాయకుడి విగ్రహాల వద్ద లడ్డు దొంగతనం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై పట్టణ పోలీసులు ఆరా తీశారు. ఇందులో భాగంగానే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు యువకులు వినాయకుడి మండపాల లడ్డు దొంగతనం చేస్తూ కనిపించడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులు లడ్డూలను ఎందుకు దొంగతనం చేస్తున్నారని అడగడంతో తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే తన ఆరోగ్యం కోసం పూజారి ఈ విధంగా లడ్డూలను దొంగతనం చేయమని చెప్పారని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్వామివారి విగ్రహాల వద్ద నుంచి దొంగతనం చేసిన లడ్డూలను తన తల్లికి తినిపించడం వల్ల తల్లి ఆరోగ్యం కుదుటపడిందని యువకులు చెప్పడం విశేషం. వినాయకుడి మండపాల వద్ద లడ్డూలు మాయమవుతున్నట్లు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు వీటిపై కేసు నమోదు చేయకుండా కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలేరియా, డెంగ్యూ ఒకేలా అనుకుంటున్నారా..? నిజం ఇది తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన…

18 minutes ago

శనివారం పిండి దీపం పూజ ఎందుకు ప్రత్యేకం..? పిండి దీపం పూజ రహస్యం ఏమిటి..?

శనివారం రోజు హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేందుకు ఈ రోజు…

39 minutes ago

టీ, కాఫీకి గుడ్‌బై చెప్పండి.. ఉదయం మజ్జిగతో అద్భుత లాభాలు!

ఉదయం లేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. బెడ్ టీ లేకుండా రోజు మొదలవదనే అలవాటు చాలా…

58 minutes ago

స్పృహ కోల్పోతే నీరు తాగిస్తున్నారా..? ఇది ప్రాణాంతక తప్పు కావచ్చు!

అకస్మాత్తుగా ఎవరో స్పృహ కోల్పోతే చాలామంది వెంటనే చేసే పని వారి ముఖంపై నీళ్లు చల్లడం లేదా నీరు తాగించడానికి…

1 hour ago

కాల్షియం లోపానికి ఉప్పు కారణమా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఉప్పు లేకుండా ఆహారం పూర్తవదు. ప్రతి ఇంట్లో రోజూ వాడే ముఖ్య పదార్థాల్లో ఉప్పు ఒకటి. కానీ దీని వినియోగం…

1 hour ago

టెన్షన్ ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుందా..? జీవనశైలిలో దాగి ఉన్న అసలు కారణాలు

ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య చాలా సాధారణంగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా…

1 hour ago