వినాయకుడి లడ్డూలను దొంగతనం చేసిన యువకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

0
134

మీకు బిచ్చగాడు సినిమా గుర్తుందా.. అందులో హీరో తన తల్లి కోసం,తన తల్లి ఆరోగ్యం కుదటపడడం కోసం ఏకంగా బిచ్చగాడుగా మారి దీక్షచేసి తన తల్లిని బ్రతికించుకుంటాడు. అచ్చం బిచ్చగాడు సినిమాను తలదన్నేలా ఇద్దరు యువకులు తనతల్లి ఆరోగ్యం కోసం ఏకంగా దొంగతనానికి పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు తన తల్లి గత ఆరు నెలల నుంచి అనారోగ్యం పాలవడంతో ఎన్నో ఆసుపత్రులు తిరిగి వైద్యం చేయించినప్పటికీ ఏ విధమైన ఫలితం లేదు. ఈ క్రమంలోనే ఒక పూజారి వినాయకుడి మండపాల వద్ద పెట్టిన లడ్డు దొంగతనం చేసి తన తల్లికి తినిపించడం వల్ల తన ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు.

దీంతో ఆ ఇద్దరు యువకులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గత మూడు రోజుల నుంచి వేములవాడ పట్టణంలో పెట్టినటువంటి వినాయకుడి విగ్రహాల వద్ద లడ్డు దొంగతనం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయంపై పట్టణ పోలీసులు ఆరా తీశారు. ఇందులో భాగంగానే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు యువకులు వినాయకుడి మండపాల లడ్డు దొంగతనం చేస్తూ కనిపించడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే పోలీసులు లడ్డూలను ఎందుకు దొంగతనం చేస్తున్నారని అడగడంతో తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే తన ఆరోగ్యం కోసం పూజారి ఈ విధంగా లడ్డూలను దొంగతనం చేయమని చెప్పారని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్వామివారి విగ్రహాల వద్ద నుంచి దొంగతనం చేసిన లడ్డూలను తన తల్లికి తినిపించడం వల్ల తల్లి ఆరోగ్యం కుదుటపడిందని యువకులు చెప్పడం విశేషం. వినాయకుడి మండపాల వద్ద లడ్డూలు మాయమవుతున్నట్లు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు వీటిపై కేసు నమోదు చేయకుండా కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here