బిగ్ బాస్ సీజన్ 5 లో రెండో కెప్టెన్సీ టాస్క్ ఎట్టకేలకు చివరి అంకానికి చేరుకుంది. ఇరుజట్లు సరి సమానంగా నిలిచారు. తర్వాత ఫైనల్ గేమ్ అనేది ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో తెలవనున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా స్టార్ మా మరో ప్రోమోను విడుదల చేసింది. అందులో యూట్యూబ్ పాపులర్ షణ్ముఖ్ బర్త్ డే ను హౌస్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
మొదట ప్రోమోలో ఏముందంటే.. కాజల్ ముందుగా షణ్ముఖ్ దగ్గరకు వచ్చి.. హమిదాలో నీకు నచ్చే అంశాలు ఏంటని అడుగుతుంది. దానిని పక్కనే ఉన్న హమిదా నవ్వుతూ అతడి వైపే చూస్తుంది. అయితే దానిక సమాధానంగా షణ్ముఖ్ .. షి ఈజ్ హార్ట్ అంటూ చెబుతాడు. దానికి యాంకర్ రవి.. ఎందుకు మీరు హమిదా ఎదురుగా చెప్పకుండా.. నా ఎదురుగా ఎందుకు చెప్పారు అంటూ ప్రశ్నిస్తాడు. కొన్ని కొన్ని విషయాలను చెప్పకూడదు.. అనగానే సరే రా.. చెప్పురా అంటూ హమిదా షణ్ముఖ్ ను అంటుంది.
యాంకర్ రవి ఆ మాటలను ఉటంకిస్తూ.. ‘రా.. చెప్పురా.. రా పట్టుకో’ అంటూ చెప్పడంతో అతడు నవ్వుతాడు. ఇక్కడ దీప్తి ఉందని.. ఇక్కడ కూడా ఒక కన్నేసి ఉంచండంటూ లహరి అంటుంది. సార్ మీకు దండం పెడతా.. అటూ షణ్ముఖ్ రవిని వేడుకుంటుండగా.. పిల్లోపై హెచ్ అనే అక్షరం రాస్తా అంటూ రవి అంటాడు. హౌస్ లో ఉన్నంత వరకు ఆ పిల్లోపై డీ తీసేసి.. హెచ్ రాసుకో.. బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ డీ (డీ అంటే దీప్తి) పెట్టుకో అంటూ హమిదా చెబుతుంది. ఇదంతా మీరు చూడాలండి అంటూ రవి దీప్తి సునయనాకు పరోక్షంగా చెబుతాడు. అక్కడ సంభాషణ అంతా నవ్వులతోనే అవుతుంది.
తర్వాత హౌస్ సభ్యులు అంతా హాల్లో కూర్చున్న తర్వాత ‘హలో షణ్ము’ అంటూ దీప్తి వీడియో కాల్ లో కనిపిస్తుంది. తర్వాత ‘ఐ లవ్ యూ’ అంటూ చెబుతుంది. తర్వాత హౌస్ సభ్యులు అంతా అతడికి హ్యపీ బర్త్ డే చెబుతూ డ్యాన్స్ లు వేస్తూ ఉంటారు. బయట నుంచి కాంతి వెలుగులో పెద్ద సౌండ్ ల్లో బిగ్ బాస్ జబర్దస్త్ గా ప్లాన్ చేసి.. షణ్ముఖ్ కు పుట్టిన రోజుకు సర్ ఫ్రైజ్ ఇస్తాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…