హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 1004 ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://www.rrchubli.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నైరుతి రైల్వే నుంచి రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా జనవరి 9వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. ఏపీ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మైసూర్, బెంగళూరు, హుబ్లీ డివిజన్ లలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు పని చేయాల్సి ఉంది. సెంట్రల్ వర్క్‌షాప్, క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ లలో ఉద్యోగాలకు ఎంపికైన వారు పని చేయాల్సి ఉంటుంది.
మొత్తం 1004 ఖాళీలలో హుబ్లీ డివిజన్ లో 287 ఖాళీలు, హుబ్లీ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ లో 217 ఖాళీలు, బెంగళూరు డివిజన్ లో 280 ఖాళీలు, మైసూరు డివిజన్ లో 177 ఉద్యోగాలు, సెంట్రల్ వర్క్ షప్ మైసూర్ లో 43 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొవచ్చు. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. విభాగాల వారీగా ఫిట్టర్, ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్), ఎలక్ట్రీషియన్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…