Sowmya Rao: బుల్లితెర పై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎంతోమంది కమెడియన్లతో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం నుంచి స్టార్ కమెడియన్స్ అందరూ కూడా వెళ్లిపోవడంతో అతి కష్టం మీద ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి రేటింగ్ రావడం కోసం నిర్వాహకులు చేసే స్టంట్ లు కూడా మామూలుగా లేవు. ఇలా రేటింగ్స్ కోసం భారీగా స్టంట్ చేస్తున్న నేపథ్యంలో నేటిజెన్ల ఆగ్రహానికి కూడా గురవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ సౌమ్యరావు ఏకంగా జడ్జి కృష్ణ భగవాన్ కి ముద్దు పెట్టడం హైలైట్ అవుతుంది.
ఈ ప్రోమోలో భాగంగా నూకరాజు ప్రసాద్ ఇద్దరు కూడా విభిన్నమైన స్కిట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా నూకరాజు ప్రసాద్ మాటలు లేకుండా కేవలం చేష్టలతోనే అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. తర్వాత నూకరాజు వెళ్లి జడ్జి కృష్ణ భగవాన్ చేతికి ముద్దు పెట్టారు. నువ్వు కూడా వెళ్లి పెట్టాలి అంటూ సౌమ్య రావుకు చెప్పడంతో ఆమె ఏకంగా తనకు ముద్దు పెట్టడానికి వెళ్ళింది.
ఇలా సౌమ్య కృష్ణ భగవాన్ కు ముద్దు పెట్టడానికి వెళ్లడంతో ఇంద్రజ నెంబర్ బోర్డ్ కృష్ణ భగవాన్ బుగ్గకు అడ్డుపెట్టింది. ఇలా బుగ్గకు అడ్డు పెట్టడంతో సౌమ్యరావు చేసేది ఏమీ లేక కృష్ణ భగవాన్ చేతికి ముద్దు పెట్టింది.ఇలా ఈమె కృష్ణ భగవాన్ కు ముద్దు పెట్టడంతో పలువురు ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈమె ఎందుకు ముద్దు పెట్టింది ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…