Categories: FeaturedMovie News

Sowmya Rao: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ అంటూ తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న సౌమ్యరావు!

Sowmya Rao: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి నటి సౌమ్య రావు ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె యాంకర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సౌమ్యరావు నిజజీవితంలో ఎంతో విషాదం ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె తన తల్లిని కోల్పోయిన సంఘటన గురించి గత మాతృ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.

తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ చివరి క్షణాలు చాలా నరకం అనుభవించిందని ఈమె తన తల్లి పడినటువంటి కష్టాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే తాజాగా మరోసారి ఈమె తన తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తాజాగా బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈమెకు హైపర్ ఆది తన తల్లి జ్ఞాపకార్థం ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చారు.

Sowmya Rao: జ్ఞాపక శక్తి తగ్గిపోయింది..


ఇక ఆ ఫోటోని స్టేజ్ పై చూసినటువంటి సౌమ్యరావు అక్కడే పెద్ద ఎత్తున కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.తన తల్లి ఒకరోజు తలనొప్పితో బాధపడుతూ ఉండగా తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాము అయితే అది బ్రెయిన్ క్యాన్సర్ అని తెలిసి షాక్ అయ్యామని తెలిపారు. అప్పటి నుంచి తాను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారని క్రమక్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతూ వచ్చారని తెలిపారు. ఇక చివరికి తన తల్లి తనని కూడా గుర్తించలేకపోయింది అంటూ ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago