సామాన్య ప్రజల దగ్గర్నుంచి సినీ ప్రముఖుల వరకు ఎవ్వరినీ కూడా కరోనా మహమ్మారి విడిచిపెట్టడం లేదు. తాజాగా టాలీవుడ్ టాప్ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలిసిందే. ఈ సంగతి ఓ వీడియో రూపంలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్వయంగా తెలియజేశారు.
ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆ హాస్పిటల్ డాక్టర్లు కూడా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ నిలకడగానే ఉన్నాయని, ఎప్పటికప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియ జేశారు. ఇదిలావుండగా..
తాజాగా ఇప్పుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ బారిన పడ్డారనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఈమధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పాజిటివ్ అని తెలియడంతో ముందు జాగ్రత్తగా బాలు కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించడంతో Sp బాల సుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను కరోనా చికిత్స కోసం ఓ ప్రైవేటు హాస్పటల్ లో జాయిన్ చేశారని తెలిసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…