Sp Shailaja: సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్నటువంటి వారిలో సింగర్ శైలజ ఒకరు. ఈమె స్వయంగా దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వయానా చెల్లెలు.
ఇలా ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎస్పీ శైలజ కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈమె పలు సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలజ తన కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. తన కుటుంబంలో అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మాత్రమే సింగర్ అనీ మిగతా వారందరూ కూడా సంగీత వాయిద్యాలను వాయించే వారేనని తెలిపారు. అయితే తాను సింగర్ అవుతానని ఎవరు ఊహించుకోలేదు. కానీ తాను సింగర్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డానని తెలిపారు.
ఇకపోతే ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా ఒక సినిమాలో నటించారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం సినిమాలో ఈమె నటించారు.అయితే ఇందులో ఓ సన్నివేశంలో భాగంగా తాను కమల్ హాసన్ గారిని కాలితో తన్నాల్సి వచ్చింది.అయితే ఈ సన్నివేశం చేయడానికి తాను ఎన్నిసార్లు కాళ్లు లేపిన తన కాలు వెనక్కి వచ్చేదని శైలజ తెలిపారు.ఇక డైరెక్టర్ గారు నువ్వు చేస్తున్నది కేవలం ఒక పాత్ర మాత్రమే అంటూ తనకు వివరణ ఇవ్వడంతో అప్పుడు కమల్ హాసన్ గారిని కాలితో తన్నానని ఈ సందర్భంగా అప్పటి సంఘటనను శైలజ గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…