Featured

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లు ఎంతో తెలుసా.?!

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్‌తో పోరాడి గెలిచిన బాలుని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఆ రోజు నుంచీ ఆయనను ఐసీయూలో వెంటిలేటర్‌ పై చికిత్స పొందారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ సపోర్ట్‌తో బాలుకి వైద్యులు చికిత్స అందించారు. కానీ.. ఒక్కసారిగా బాలు మరణవార్తతో యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సుమారు 50 రోజుల పాటు బాలు ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ 50 రోజుల కాలంలో బాలుకి కరోనా చికిత్స జరిగింది. ఆయనకు కరోనా వైరస్ తగ్గినట్టు వైద్యులు చెప్పారు. కానీ ఆ తర్వాత మరికొన్ని అనారోగ్య సమస్యలు బాలుకి వచ్చాయి. అందుకోసమె బాలుకి వెంటిలేటర్ పెట్టారు. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఐసీయూలో ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రి పలుమార్లు ప్రకటించింది. దాంతో ఈ 50 రోజుల ట్రీట్ మెంట్ కి ఎంత ఖర్చయి ఉంటుందనే విషయాన్ని బాలు ఫాన్స్ చర్చించుకుంటున్నారు. ‘గట్టిగానే వసూలు చేసి ఉంటారు.’ అనే అభిప్రాయాన్ని కొంతమంది ఫాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఎస్పీ బాలుకు అంతగా ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు. ఆయన ఎప్పుడూ ఆసుపత్రికి వెళ్లినట్టుగా వార్త కూడా రాలేదు. కానీ.. ఆయనకు కరోనా సోకిన దగ్గర్నుండి ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా మారడం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటె.. బాలు ఆరోగ్య పరిస్థితి కరోనా సోకిన తర్వాత విషమ స్థితిలోకి వెళ్లడానికి కారణం మరొకటి ఉంది అని తెలిసింది. గత సంవత్సరం బాలసుబ్రహ్మణ్యం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారట. అదే ఇప్పుడు ఆయనకు తిరగబడిందట. బాలు బరువు ఎక్కువగా ఉంటారని అందరికీ తెలిసైనా విషయమే.!

వయసు మీదపడుతున్న కొద్దీ ఆయన బరువు తగ్గకపోవడంతో ఇంకా బరువు పెరిగితే సమస్యలు వస్తాయేమోనన్న సందేహంతో ఆయన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారట. అందుకే ఆ మధ్య ఆయన కాస్త సన్నబడ్డట్టు కనిపించారు. అయితే.. ఈ సర్జరీ వల్ల కొన్ని అవయవాలు దెబ్బతిని.. సర్జరీ తర్వాత కొన్ని సమస్యలు కూడా వచ్చాయట. అయినా మళ్లీ క్యూర్ అయ్యే టైంలో ఇప్పుడు కరోనా మహమ్మారి రావడం.. అది కూడా వీక్ గా ఉన్న అవయవాలను అటాక్ చేయడం జరిగిందట. అందుకే బాలు ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన మరణానికి కారణమని తెలుస్తోంది.

telugudesk

Recent Posts

“అలాంటి హీరోను నేను చూడలేదు” – చిరంజీవిపై భరణి ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు సినీ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

4 minutes ago

“పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు” – అడివి శేష్ షాకింగ్ వ్యాఖ్యలు!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అడివి శేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ…

8 minutes ago

15 ఏళ్ల వయసులో చరిత్ర.. వైభవ్ సూర్యవంశీ రికార్డు రచ్చ!

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం…

12 minutes ago

“ఓటమికి వాళ్లే కారణం” – శ్రేయస్ అయ్యర్ స్ట్రెయిట్ కామెంట్స్!

ఐపీఎల్ 2026లో అద్భుతంగా ఆడుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ప్రయాణానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. రాజస్థాన్…

15 minutes ago

రియాన్ పరాగ్ వీడియో వైరల్.. బీసీసీఐ యాక్షన్ ఖాయమా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని వివాదం తలెత్తింది. జట్టు కెప్టెన్ రియాన్…

18 minutes ago

రమాప్రభ–సాగర్ మధ్య అసలు ఏం జరిగింది? బయటపడ్డ షాకింగ్ నిజం!

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాలుగా హీరోయిన్‌గా, సహాయ…

23 minutes ago