ఎస్.ఎస్.రాజమౌళిని విజువల్స్ వండర్ డైరెక్టర్ అనేకంటే భారతదేశం గర్వించదగ్గ అద్భుత దర్శకుడని అనడం కరెక్ట్ గా ఉంటుంది. చారిత్రక జానపద చిత్రాలను తెలుగు తెరపై తన అద్భుత ప్రతిభ తో ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఒక్కసారిగా మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు.
అలాంటి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఏ హీరోకైనా ఆ తర్వాత సినిమా పరాజయం కావడం జరుగుతుంది. ఇది యాదృశ్చికంగా జరుగుతుందా..? మరొకటా అన్నది అర్థం కాదు.
2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైన ఎస్.ఎస్.రాజమౌళి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించడం జరిగింది. ఆయన జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్ తో ఎక్కువ చిత్రాలను రూపొందించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఇదే సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన సుబ్బు సినిమా పరాజయాన్ని చవిచూసింది. 2003లో రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా అద్భుత విజయాన్ని సాధించగా, 2004లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 2007లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సూపర్ హిట్ సినిమాగా నిలువగా, 2008లో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమా పరాజయం పొందింది.
ఆ తర్వాత 2004లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా సూపర్ హిట్ అవగా, 2005లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ నటించిన అల్లరి బుల్లోడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి మూవీ మంచి విజయాన్ని సాధించగా, 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన పౌర్ణమి సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
2015, 2017 లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి (the beginning), బాహుబలి (the conclusion) ఈ జానపద చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత 2019 లో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో పరాజయం పొందింది.
2006లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఇదే సంవత్సరంలో రవితేజ హీరోగా ఖతర్నాక్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 2009లో రాజామౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మగధీరుడు చిత్రం విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆరెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. 2010లో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా మర్యాద రామన్న చిత్రం విడుదలై సూపర్ హిట్ అవగా, 2011లో వర్మ దర్శకత్వంలో వచ్చిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఆ తర్వాత 2012లో రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా ఈగ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఇదే సంవత్సరంలో హీరోయిన్ సమంత తో కలిసి ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలో నాని నటించాడు. ఐతే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశను కలిగించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…