సినిమాల్లో ఒక్కో నటునిది ఒక్కోరకమైన అభినయం.ఒకరు నవ్విస్తారు, మరొకరు బాగా ఏడిపిస్తారు. మరొకరు డ్యాన్స్ బాగా చేస్తారు.ఇంకొకరు అయితే ఫైట్లు ఇరగ దీస్తారు.ఇలా ఒక్కో నటుడు, ఒక్కో రకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో ఓ ముగ్గురు నటులు మాత్రం తాగి నటించడంలో వారికి వారే సాటి.. వారికి ఎవ్వరు లేరు పోటి అన్నట్టుగా ప్రేక్షకులను వారి అద్భుత నటనతో.. నిండైన బ్రాందీ గ్లాసులో ప్రేక్షకులను ముంచెత్తుతారు. మెగాస్టార్ చిరంజీవి విషయానికి వచ్చినట్లయితే ఆయన నటన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలో వచ్చే కొన్ని దృశ్యాల్లో తాగేసినట్టుగా నటించే ఆయన నటనకు..ఆయనే సాటి అన్నట్టుగా ప్రేక్షకులను మైమరిపిస్తారు.
1989 లో విడుదలైన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా లో విజయశాంతి చేసిన పనికి కోపంతో ఒక రోజు చిరంజీవి డ్రింక్ చేసి.. కస్తూరిబాయ్ ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్లి విజయశాంతిని పట్టుకొని శశిరేఖ అందరి ముందు ముక్కుపై వేలు పెట్టి చూపిస్తావా అంటూ… విజయశాంతిని నిలదీసే సీన్ లో చిరంజీవి నటన చాలా బాగుంటుంది.
అలాగే 1992 లో విడుదలైన ఘరానా మొగుడు చిత్రంలో నగ్మా తో “ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు.. ఎక్కడో కుచ్చింది చేప ముళ్ళు.. సంచిలో సరుకేదో పట్టుకెళ్ళు విస్కీ పట్టుఅలా.. సోడా కొట్టు ఇలా..!! అంటూ చిరంజీవి మందేసినట్టుగా నటించిన ఆ పాట ప్రేక్షకులు ఎప్పుడు విన్నా కిక్ ఎక్కుతుంది.
ఆ తర్వాత పెదరాయుడు చిత్రంతో తెరంగేట్రం చేసిన ఎమ్మెస్ నారాయణ తాగుబోతు పాత్రలకు పెట్టింది పేరు. 1995 అనంతరం తాగుబోతు పాత్ర ఉందంటే తప్పనిసరిగా ఎమ్మెస్ నారాయణను తీసుకోవాల్సిందే. జగపతిబాబు హీరోగా నటించిన కబడ్డీ, కబడ్డీ చిత్రం లో ఎం.ఎస్.నారాయణ తాగుబోతుగా నటించిన తీరు అమోఘం తన ఇంటి కోడినే దొంగకోళ్లు సాంబయ్య దగ్గర 50 రూపాయలకు కొని ఇంటికెళ్లి అదే కోడిని కూర వండుమంటాడు. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ తాగుబోతు పాత్రలో ఆయన నటన చాలా తమాషాగా ఉంటుంది.అలాగే వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమాలో రవితేజ, త్రిష లేచిపోయి ఒక గూడానికి వస్తారు.అక్కడ ఎం.ఎస్.నారాయణ వాళ్లను చూసి విలన్ గ్యాంగ్ ను పిలుస్తాడు. ఎం ఎస్ నారాయణ చేసిన అప్పులు మొత్తం కడితే వారిని ఎక్కడ దాచానో చెప్తాననడంతో.. అప్పుడు మొత్తం అప్పులు కట్టి తీరా ఇంటిలోకి వెళ్లేసరికి వారు పారిపోతారు. ఆ సినిమాలో ఎం.ఎస్ నారాయణ తాగుబోతు నటన బాగుంటుంది.
హాస్యనటుడు రమేష్ 2005 లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడం సినిమాలో చిన్న వేషం వేసి… ఆ తర్వాత తాగుబోతులను బాగా గమనించి వారిలాగా నటించడం మొదలు పెట్టాడు. అలా ఆయన ఇంటిపేరు తో కాకుండా తాగుబోతు రమేష్ గా సినీ పరిశ్రమలో పిలువబడుతున్నాడు. నితిన్ హీరోగా వచ్చిన చిన్నదాన నీకోసం చిత్రంలో అమ్మాయిలు ఉండే ఒక అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా పని చేస్తూంటాడు.ఆ క్రమంలో ఎవరైనా 500 లేదా 1000 రూపాయలు ఇచ్చినట్లయితే వారికి అమ్మాయిల గురించి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు.”అలా మొదలైంది”చిత్రంలో కూడా తాగుబోతుగా రమేష్ నటించిన తీరు ప్రేక్షకులందరికి కిక్కెక్కిస్తుంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…