Sravana Bhargavi : అన్నమయ్య కీర్తనలకు అవమానం.. శ్రావణ భార్గవిపై అన్నమయ్య వంశస్థుల ఆగ్రహం..!

Sravana Bhargavi : తెలుగు సినీ అభిమానులు అందరికి శ్రావణ భార్గవి సుపరిచితమే. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సింహ’ సినిమాలో ‘సింహమంటి చిన్నోడే’ పాటతో మొదటి విజయాన్ని అందుకుంది. తరువాత వెణు తిరిగి చూసుకునే పని లేకుండా వరుస పాటలతో అభిమానులను అలరించింది. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల తన భర్త హేమ చంద్రతో విడాకులు తీసుకుంటున్నారు అన్న రూమర్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి ఒక పాట పాడి వివాదాలలో చిక్కుకుంది.

ఈ వివాదంలో అవసరం అయితే కోర్టుకు కూడా వెళతాం…

కొంత కాలంగా పెద్దగా పాటలు ఏవి పాడకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది శ్రావణ భార్గవి. ఈక్రమం లోనే తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. మన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యులు తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో మెప్పించిన కీర్తనను శ్రావణ భార్గవి పాడగా ఈ వివాదం రాజుకుంది. అన్నమయ్య పెద్ద కుమారుడు అయిన పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తితో పాడిన సంకీర్తనను శ్రావణ భార్గవి ఇలా కాళ్లు ఊపుతూ, శృంగార సంకీర్తనగా పాడి చిత్రీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఆమె తన అందాన్ని వర్ణించడం కోసం ఆ కీర్తనను పాడటం తో అగ్రహిస్తున్నారు.

శ్రావణ భారగవి చేసిన ఈ వీడియో పై అన్నమయ్య వంశస్తుడు అయిన హరినారాయణ చార్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పాట గురించి శ్రావణ భార్గవితో మాట్లాడితే ఆమె బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మేము టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని, అలాగే అవసరం అయితే కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.