Movie News

Sravana Bhargavi: ఎట్టకేలకు వెనకడుగు వేసిన శ్రావణ భార్గవి.. యూట్యూబ్ నుంచి వీడియో తొలగింపు?

Sravana Bhargavi: సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులను పెంచుకున్నారు. ఇలా సోషల్ మీడియా వ్యక్తులు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శ్రావణ భార్గవి తాజాగా అన్నమయ్య కీర్తనలలో ఒకటైన ఒకపరికొకరి వయ్యారమే అనే పాటను పాడడమే కాకుండా అందులో నటించింది.

ఇలా ఈ పాటలో ఈమె పడుకొని కాళ్లు ఊపుతూ జంతికలు తింటూ శృంగార భరితంగా నటించింది అని ఈ పాటపై పెద్ద ఎత్తున వివాదం చెల్లరేగింది. దీంతో ఈ పాట తొలగించాలని ఈమెకు ఎంతోమంది సూచించినప్పటికీ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆ పాటలో ఎలాంటి అసభ్యకరంగా తాను నటించలేదని తాను ఈ పాటను డిలీట్ చేసే ప్రసక్తే లేదని తెలిపారు.

ఇలా ఈమె ఈ పాట విషయంలో మొండి పట్టు పట్టడంతో ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ వివాదం పై స్పందిస్తూ శ్రావణ భార్గవి కౌంటర్ వేశారు.అయినప్పటికీ ఈ పాటను శ్రావణ భార్గవి డిలీట్ చేయకపోవడంతో అన్నమయ్య వంశస్థులు, టీటీడీ అధికారులకు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈమెపై పోలీసు కేసు కూడా నమోదు అయింది.

శ్రావణ భార్గవి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన అన్నమయ్య వంశీకులు…

ఈ విధంగా శ్రావణ భార్గవి ఈ పాట రోజురోజుకు వివాదంలో చిక్కుకోవడంతో ఏకంగా ఈమె ఈ వివాదంపై స్పందిస్తూ ఒక మెట్టు దిగి ఈ పాటను డిలీట్ చేశారు.ఇలా శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియోని డిలీట్ చేయడంతో ఎంతోమంది స్వామి వారి భక్తులతో పాటు అన్నమయ్య వంశీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మీ కళ్లు పెద్దవా? అయితే మీ స్వభావం ఇలా ఉంటుందట!

మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…

7 minutes ago

పుట్టుమచ్చల రహస్యం: ఈ చోట్ల ఉంటే సంపద, సౌఖ్యం మీవే!

పుట్టుమచ్చలు అంటే సాధారణంగా శరీరంపై కనిపించే చిన్న గుర్తులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే భారతీయ సంప్రదాయాల్లో, ముఖ్యంగా…

21 minutes ago

ఎండలో బయటికి వెళ్లగానే తలనొప్పి వస్తుందా? ఇది సాధారణం కాదు… శరీరం ఇస్తున్న హెచ్చరిక!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న…

1 hour ago

పెళ్లి తర్వాత తొలి బర్త్‌డే… కూర్గ్‌లో రష్మిక సెలబ్రేషన్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత…

1 hour ago

నమ్మాలా? వదిలేయాలా? ఈ ప్రాంతాలపై ప్రజల్లో భయం ఎందుకు?

భారతదేశంలో ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు కొన్ని ప్రదేశాలు రహస్య ఆచారాలు, తాంత్రిక…

2 hours ago

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల డిజిటల్ భద్రతపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 13 ఏళ్లలోపు పిల్లలను సోషల్…

2 hours ago