Sree Leela:శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు డిజే టిల్లు సీక్వెల్ చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా అందుకున్నారు.
సిద్దు జొన్నలగడ్డ నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా డీజే టిల్లు 2 సినిమాని తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇందులో నేహా శెట్టికి బదులు పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీలాను ఎంపిక చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన రెండు రోజులకే చిత్ర బృందానికి శ్రీ లీల గట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో తాను నటించలేనని ఈమె ఈ సినిమాకి గుడ్ బై చెప్పినట్టు సమాచారం.ఈ సినిమా నుంచి ఈమె తప్పుకోవడానికి సరైన కారణం తెలియక పోయినప్పటికీ ఇలా శ్రీ లీలా మధ్యలో వెళ్లిపోవడంతో చిత్ర బృందం మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.
ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం రవితేజ నటించిన ధమాకా సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే మారుతి ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండగా అందులో ఒకరిగా ఈమె అవకాశం అందుకున్నట్టు తెలుస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీ లీల డిజె టిల్లు సీక్వెల్ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…