Sreeja: నీపై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేను.. ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీజ!
Sreeja: మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ పేరు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుకు గల కారణం ఈమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన భర్త పేరును తొలగించి శ్రీజ కొణిదల అని పెట్టుకోవడమే కారణమని చెప్పవచ్చు. ఇలా తన భర్త పేరును తొలగించడంతో శ్రీజ త్వరలోనే తన భర్తకు విడాకులు ఇవ్వబోతోంది అంటూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.
ఈ విషయం గురించి పరోక్షంగా వీరు మాట్లాడినప్పటికీ అభిమానులు మాత్రం త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే శ్రీజ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగా హీరో వరుణ్ తేజ్ నిన్న (జనవరి 19)పుట్టిన రోజు జరుపుకోవడంతో ఈయనకు మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కి శ్రీజ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన తమ్ముడి పై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.
వరుణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా శ్రీజ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హ్యాపీ బర్త్ డే చిన్న తమ్ముడు.. పొడుగా ఉన్నంత మాత్రాన తెలివైనవారు కాదు నీకోసం నేనున్నాను.. నా చిన్నతనాన్ని ఎంతో సంతోషంగా గడిచేలా చేసినందుకు చాలా థాంక్స్.. ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంతో ప్రేమను చూపించావు …నీపై నాకున్న ప్రేమ మాటలలో చెప్పలేను అంటూ వరుణ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీజ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…