Sreeja: మెగా డాటర్ శ్రీజ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం ఆమె సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త పేరును తొలగించడమే. శ్రీజ కళ్యాణ్ గా ఉన్న పేరును కాస్తా…శ్రీజ కొణిదెలగా మార్చడంతో వీరిద్దరి మధ్య వ్యవహారం చెడిందని త్వరలోనే వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా వీరి గురించి ఏదో ఒక వార్త రోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నప్పటికీ వీరి విడాకుల విషయం గురించి ఇప్పటి వరకు మెగా కుటుంబం ఏమాత్రం స్పందించలేదు.ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం శ్రీజ తన అన్న రామ్ చరణ్ తో కలిసి ముంబైలో వీధులలో చక్కర్లు కొట్టారు.
ఈ విధంగా రామ్ చరణ్ శ్రీజ ముంబైలో కనిపించడంతో వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో శ్రీజ ముంబై వెళ్ళడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరా తీస్తున్నారు.అయితే శ్రీజ డిప్రెషన్ లో ఉందని తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్త కూడా వినపడుతుంది.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ శ్రీజ తన ముంబైకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆ ఫోటోలను షేర్ చేస్తూ… ‘హగ్స్ అండ్ హగ్స్..నేను బ్రతకడానికి సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాలు ఇవే అంటూ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…