Sreeleela: శ్రీ లీల పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు తెలుగులో డజన్ కి పైగా సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె నటించిన సినిమాలన్నీ కూడా అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈమెకు తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మినహా ఇతర సినిమాలేవి లేవని చెప్పాలి.
ఇక తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీపై ఈమె కన్నేసారని వార్తలు కూడా వచ్చాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు అజిత్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక ఈ సినిమా గురించి ఎలాంటి విషయం ప్రకటించక ముందే ఈమె బాలీవుడ్ అవకాశాన్ని కూడా అందుకున్నారు అంటూ మరొక వార్త చెక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇబ్రహీం ఖాన్..
ఇక ఈయన వారసుడు ఇబ్రహీం ఖాన్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన నటిస్తున్న దిలర్ సినిమాలు శ్రీ లీలను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేకపోయినా ఈ వార్తలు వైరల్ గా మారడంతో శ్రీ లీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇదే కనుక నిజమైతే ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుకుంటున్నారని చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…