Sreeleela: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి ముద్దు గుమ్మలలో శ్రీ లీల రష్మిక మందన్న ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు.ఇలా ఇద్దరు కనడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్లుగా పరిచయమై తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ పొందడమే కాకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇక రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమకు చలో సినిమా ద్వారా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడమే కాకుండా నేషనల్ క్రష్ గా మారిపోయారు. అయితే ఈమె నేషనల్ క్రష్ అవ్వడానికి మరొక హీరోయిన్ కారణమని తెలుస్తుంది.
రష్మిక నటించిన చలో సినిమా ఎంతో మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం రష్మికకు కాకుండా నటి శ్రీలీలకు వచ్చిందట. చివరి వరకు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా అనే భావించారు. అయితే చివరి క్షణంలో శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా అవకాశం రష్మికకు వచ్చిందని తెలుస్తోంది.
ఇలా ఈ సినిమాలో రష్మిక నటించే అవకాశం అందుకోవడం ఈ సినిమా మంచి సక్సెస్ కావడం జరిగింది.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు రావడం నేషనల్ క్రష్ అనే గుర్తింపు సంపాదించుకోవడం జరిగింది.ఇక శ్రీ లీల కూడా పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…