Rahul Ravindran: చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి శ్రీపాద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహిళలకు వస్తున్నటువంటి సమస్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె భారీగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు.
గతంలో ఈమె తమిళ ప్రముఖ రచయిత వైరుముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయం కాస్త అప్పట్లో చాలా వివాదంగా మారింది. దీంతో ఈమెను కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బహిష్కరణ చేసింది. ఇలా అప్పటి నుంచి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తున్నటువంటి చిన్మయిని అదే స్థాయిలో నెటిజన్స్ ట్రోల్ చేసేవారు.
ఇలా తన గురించి ఎన్ని విమర్శలు చేసిన ఆమె మాత్రం తన అభిప్రాయాలను అందరితో పంచుకునేవారు అయితే తాజాగా మరోసారి సింగర్ చిన్మయిపై ఇలాంటి ట్రోల్స్ చేయడమే కాకుండా ఏకంగా తన భర్త నటుడు రాహుల్ రవీందర్ కు ట్యాగ్ చేశారు. దీంతో మొదటిసారి తన భార్యపై వస్తున్నటువంటి ట్రోల్స్ గురించి స్పందించాల్సి వచ్చింది.ఈ సందర్భంగా రాహుల్ రవీందర్ చిన్మయి గురించి తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఒక నోట్ విడుదల చేశారు.
చిన్మయినీ కేవలం ఒక సెలబ్రిటీగా మాత్రమే చూడకండి సమాజంలో ఉన్న సమస్యలపై ఆమె చేస్తున్న పోరాటం చూడండి. ఆమె చేసే పనినీ మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.ముందుగా ఆమె చెప్పేది వినండి విన్న తర్వాత తనతో ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అన్నది మీ ఇష్టం.ఆమె అందరితో మంచిగా ఉంటుంది ఒక అభిమాని లాగా ఒక అక్క లాగా అందరి పట్ల ప్రేమను చూపిస్తుంది. తన ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను మరో కోణంలో చూసినప్పుడే పరిష్కారం లభిస్తుందనీ ఆయన ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…