Sri Devi:ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అందాల తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బాల నటిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగులోను తమిళ హిందీ భోజ్ పురి వంటి ఎన్నో భాషలలో హీరోయిన్ గా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి ఆ పాత్రకు 100 శాతం న్యాయం చేస్తూ సినిమాలలో నటించే శ్రీదేవి ఆకాలమరణం ఇండియన్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఈమె 2018 ఫిబ్రవరి నెలలో దుబాయ్ లోని ఒక హోటల్లో బాత్ టబ్లో పడి మరణించారు అయితే ఈమె మరణం గురించి మాత్రం ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఉన్నాయని చెప్పాలి ఇలా బాత్ టబ్ లో పడి మరణించడం ఏంటి అంటూ ఎంతో మంది ఈమె మరణం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బోనీ కపూర్ శ్రీదేవి గురించి పలు విషయాలు తెలియజేశారు. శ్రీదేవి ఏదైనా ఒక పాత్రకు కమిట్ అవ్వాలి అనుకుంటే తన శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలో ఆ విధంగానే మలుచుకునేది అందుకు సంబంధించి ఎన్నో రకాల వ్యాయామాలు వర్కౌట్స్ డైట్ ఫాలో అయ్యేది. ఇక శ్రీదేవి ఏం తిన్నా కూడా ఉప్పు లేకుండా చూసుకునేది తద్వారా తనకు లో బీపీ కూడా ఉంది ఇక క్రాస్ డైట్ ఫాలో అయ్యేది.
ఇలా అందం కోసం అలాగే తన పాత్రకు అనుగుణంగా శరీర ఆకృతి కోసం ఎంతో కఠినతరమైన వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం పై పూర్తిగా శ్రద్ధ వహించేది కాదని ఇలా తన ఆరోగ్యం పై అశ్రద్ధ వహించడం వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…