Sri Reddy: పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.
ఇక ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా సినిమాలో ఏ మాత్రం కంటెంట్ లేకపోయినా సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారని, చివరికి విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమా విజయం పై నటి శ్రీరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి మాట్లాడుతూ తీసేవన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే… పైగా మహేష్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడం ఏంటో.. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు బాబు డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష అంటూ ఈమె కామెంట్ చేశారు.
సినిమాలో కంటెంట్ లేదు కానీ సినిమాకి ఇలాంటి హైప్ అవసరమా.. అంతేకాదు లైగర్ ముందు లైగర్ తర్వాత అంట మనకు ఇలాంటి వన్నీ అవసరమా.. అసలు లైగర్ సినిమా కన్నా కార్తికేయ 2 సినిమా చాలా బాగుందంటూ ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమాని విడుదల చేసినప్పటికీ ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…