ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ ఏదంటే.. చైసామ్ విడాకుల మ్యాటర్. మామూలుగా కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీనే అది ఓ ఊపు ఊపింది. ఇద్దరం విడిపోతున్నామంటూ సింపుల్ గా ట్వీట్ల ద్వారా సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రకటించారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు చైసామ్ అభిమానులు కూడా ఒక్కసారిగా బిత్తరపోయారు. నిజానికి.. వాళ్లిద్దరూ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి మీడియా కోడైకూసినా కూడా అదంతా ఉత్తి పుకారే అని చాలామంది కొట్టిపారేశారు. చివరకు సమంత కూడా విడాకుల విషయంపై పలువులు జర్నలిస్టులపై సీరియస్ అవడంతో.. ఎహె.. వాళ్లెందుకు విడాకులు తీసుకుంటారులే అని అంతా అనుకున్నారు.
అంతలోనే సడెన్ గా అందరికీ షాక్ ఇస్తూ ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోతున్నారో అటు నాగచైతన్య గాని, ఇటు సమంత గాని సరైన కారణం చెప్పలేదు. అది వాళ్ల వ్యక్తిగత విషయం. అందరికీ చెప్పాల్సిన అవసరం వాళ్ళిద్దరికీ లేదు. అయినా కూడా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సమంత – నాగచైతన్య విడిపోవడానికి కారణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ అంటూ వారిద్దరికీ ఎఫైర్ అంటగట్టారు. అయితే దీనిపై అటు సమంత, ప్రీతమ్ జూకాల్కర్ ఇద్దరూ ఘాటుగానే స్పందించారు.
ప్రీతమ్ జుకల్కర్ అయితే తానూ సమంతను అక్క అని పిలుస్తానని.. మారిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటో నాగచైతన్యకు కూడా తెలుసని, దీనిపై నాగచైతన్య స్పందించాలని చెప్పాడు. అయితే తాజగా ఈ విషయంపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె మట్లాడుతూ తనకు తెలిసినంత వరకూ సమంత – నాగచైతన్య విడిపోయేందుకు ప్రీతమ్ కారణం కాదని నేను కచ్చితంగా చెప్పగలనని చెప్పారు.దీనికి కారణం ప్రీతమ్ ఒక గే అని, అటువంటి ప్రీతమ్ తో సమంత సంబంధం ఎలా పెట్టుకుంటుందని ఆమె ప్రశ్నించారు. అవన్నీ వొట్టి పుకార్లని తెల్చిపారేసింది శ్రీరెడ్డి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…