Sridevi drama company : ఈటీవీలో జబర్దస్త్, ఢీ డాన్స్ షో వంటి షోస్ తో పోటీ పడుతూ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పటివరకు 74 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతి వారం ఒక కొత్త కాన్సెప్ట్ తో అలరిస్తుంటారు. ఇక 75 వ ఎపిసోడ్ లో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన ఇషా చావ్లా సందడి చేసింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో గత కొన్ని ఎపిసోడ్ల నుండి సుధీర్ రావడం లేదు. హోస్ట్ గా రష్మీ సందడి చేస్తోంది.
ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్…
ఇక జడ్జెస్ మారుతూనే ఉన్న ఈ షోలో ప్రస్తుతం పూర్ణ జడ్జి గా వస్తోంది. షోలో ఆది, రామ్ ప్రసాద్, వర్ష, ఇమ్మానుయేల్, అన్నపూర్ణ వంటి వారు స్కిట్లతో అలరించారు. అన్నపూర్ణమ్మ, ఆది కలిసి పుష్ప స్కిట్స్ తో నవ్వించారు. ఇక పూర్ణ డాన్స్ తో అలరించింది. ఇక షోలో ఇషా చావ్లా సందడి చేసింది. ముఖ్యంగా ఆది, ఇషా కు 11 గిఫ్టులతో ప్రొపోజ్ చేయడం, సుధీర్, రష్మీలను అనుకరిస్తూ నవ్వించారు .
ఇక చివర్లో ఏమైందో తెలియదు కానీ అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. చివరికి మిగిలేది అంటూ మహానటి లో సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తూ అందరూ కంట తడి పెట్టడం తో ప్రోమో ఎండ్ చేసారు. ఇక అసలు ఏం జరిగిందో తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ చూడాల్సిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…