Featured

Srikanth : కేవలం డబ్బుకి కక్కుర్తిపడి మజిలీ లో ఆ క్యారెక్టర్ చేశా….!

Srikanth : శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగార్ తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా వైద్యుడైన శ్రీకాంత్ సినిమా మీద మక్కువతో సినిమా పరిశ్రమలోకి వచ్చారు. అటు రైటర్ గానూ కొన్నాళ్ళు ఉన్న శ్రీకాంత్ ఇపుడు పూర్తిగా నటుడుగా సినిమాల్లో నటిస్తున్నారు. ‘ప్రతిరోజు పండగే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తన పాత్రలను ఎలా ఎంపిక చేసుకుంటారో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

కక్కుర్తి పడి మజిలీ సినిమాలో చేశా…

సినిమా పరిశ్రమలో అందరితోనూ ఒక కుటుంబంలా ఉంటానని నన్ను కూడా అందరూ బాబాయ్, పప్పా, భయ్యా అంటూ పిలుస్తారని చెప్పారు. ఎప్పుడైనా ఎవరైనా విసుక్కున్నా వాళ్ళు పని ఒత్తిడిలో అలా చేస్తారు తప్ప మామూలుగా ఉంటే అలా చేయరు కదా అని అనుకుంటా తప్ప అలాంటివి పట్టించుకోను. అయితే ఎవరైనా కావాలని కెలికితే మాత్రం వద్దు అని మొదటే చెబుతా వినకుంటే ముఖం పై చెప్పేసి పక్కకు వచ్చేస్తా అంటూ చెప్పారు.

ఇక పాత్రల ఎంపిక విషయంలో రెమ్యూనరేషన్, డేట్స్ సర్దుబాటుకి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఒకసారి కుటుంబంతో కలిసి గోవా వెళ్ళాలి అనుకున్న సమయానికి శివ నిర్వాణ ఫోన్ చేసి ఒక్క సన్నివేశం ఉంది మజిలీ సినిమాలో చేస్తారా అని అడుగగా సరే ఒక ముప్పై, నలభై వేలు వస్తాయి కదా ట్రిప్ కి పనికి వస్తాయని డబ్బుకి కక్కుర్తి పడి చేశాను. అంతే పాత్ర ఏంటి ఎలా అని ఏం ఆలోచించలేదు. ఇక ఆ సినిమా చూసి దర్శకుడు మారుతీ ఫోన్ చేసి ప్రతిరోజు పండగే సినిమా ఆఫర్ ఇచ్చారు. మజిలీ లో మీ నటన బాగుందని చెప్పారు. అందుకే పాత్రల విషయంలో ఇదే చేయాలి అదే చేయాలి అని పెద్దగా ఆలోచించను అంటూ చెప్పారు శ్రీకాంత్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago